త్వరలో విడుదల కానున్న 'కుబేర' అప్డేట్

by సూర్య | Mon, Apr 29, 2024, 02:48 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి 'కుబేర' అనే టైటిల్ ని లాక్ చేసారు. ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా కనిపించనున్నట్లు సమచారం. తాజాగా మూవీ మేకర్స్ కుబేర కి సంబందించిన అప్డేట్ ని త్వరలో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'ఇండియన్ 2' విడుదల అప్పుడేనా? Wed, May 15, 2024, 06:52 PM
యూట్యూబ్ ట్రెండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Wed, May 15, 2024, 06:50 PM
'హరోమ్ హర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 15, 2024, 06:42 PM
'రత్నం' డిజిటల్ ఎంట్రీ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 15, 2024, 06:39 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలి షెడ్యూల్ జరిగేది ఎప్పటివరకంటే...! Wed, May 15, 2024, 06:11 PM