'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ కి టైమ్ లాక్

by సూర్య | Fri, Apr 26, 2024, 06:04 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ ని రేపు మధ్యాహ్నం 4 :01 గంటలకి హైదరాబాద్ లోని AMB సినిమాస్ స్క్రీన్ 1 లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 17, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
నేడు రివీల్ కానున్న 'రాయన్' అప్డేట్ Mon, May 06, 2024, 04:26 PM
బుక్ మై షో టాప్ ట్రేండింగ్ లో 'ప్రసన్నవదనం' Mon, May 06, 2024, 04:23 PM
2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' Mon, May 06, 2024, 04:21 PM
'చిత్రం చూడరా' OTT అరంగేట్రంకి తేదీ లాక్ Mon, May 06, 2024, 03:58 PM
షూటింగ్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌ Mon, May 06, 2024, 03:56 PM