30M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ది గోట్' లోని విజిల్ పోడు సాంగ్

by సూర్య | Fri, Apr 19, 2024, 05:24 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానుంది.


ఇటీవలే మూవీ మేకర్స్ ఈ మెగా-బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌యొక్క ఫస్ట్ సింగల్ ని విజిల్ పోడుఅనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 30M వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM