'మంజుమ్మెల్ బాయ్స్' OTT ఎంట్రీ ఎప్పుడంటే..!

by సూర్య | Fri, Apr 19, 2024, 05:19 PM

చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మెల్ బాయ్స్ మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ యొక్క తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6, 2024న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 3, 2024న తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.


ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM