'మారుతి నగర్ సుబ్రమణ్యం' సెకండ్ సింగల్ అవుట్

by సూర్య | Wed, Apr 17, 2024, 04:17 PM

టాలీవుడ్‌లో అత్యంత బిజీ నటుల్లో సీనియర్ నటుడు రావు రమేష్ ఒకరు. పుష్ప మరియు KGF 2 వంటి పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌లలో కనిపించాడు. రావు రమేష్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని మేడం సర్ మేడం అంతే అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ సెకండ్ సింగల్ కి ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ గాత్రం అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

హ్యాపీ వెడ్డింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో రావు రమేష్ పూర్తి వినోదాత్మక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రావు రమేష్ సరసన సీనియర్ బ్యూటీ ఇంద్రజ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం PBR సినిమాస్ మరియు లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై నిర్మించబడింది.

Latest News
 
ట్రెండీ అవుట్ ఫిట్ లో హనీ రోజ్ Tue, Apr 30, 2024, 10:54 AM
ఘాటుగా స్పందించిన తెలుగు హీరోయిన్ Tue, Apr 30, 2024, 10:37 AM
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM