'వార్ 2' సెట్స్ లో స్టార్ హీరోస్

by సూర్య | Wed, Apr 17, 2024, 04:35 PM

బాలీవుడ్ మూవీ వార్ 2లో సౌత్ ఇండియన్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి అందరికి తెలిసిందే. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ముంబై లో వార్ 2 షూటింగ్ ని ప్రారంభించారు. ఈ సినిమా సెట్స్ నుండి స్టార్ నటుల పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్పెషల్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ కాకుండా యే జవానీ హై దీవానీ మరియు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, మరియు టైగర్ 3 తర్వాత YRF స్పై యూనివర్స్‌లో ఇది ఆరవ చిత్రం. వార్ 2 చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM