స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసిన 'హరి హర వీర మల్లు' టీమ్

by సూర్య | Wed, Apr 17, 2024, 03:57 PM

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. గత కొంత కాలంగా తన రాజకీయ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నందున ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క హై-ఎండ్ VFX పనులు శరవేగంగా జర్గుతున్నట్లు సమాచారం.


తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు శ్రీ రామ నవమి సందర్భంగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM