'తాండల్' విడుదల ఎప్పుడంటే....!

by సూర్య | Wed, Apr 17, 2024, 03:55 PM

కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. తాజాగా ఇప్పుడు తాండల్ నిర్మాతలు ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ లవ్-యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చై మత్స్యకారునిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తిని పొందింది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM