దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా ?

by సూర్య | Wed, Apr 17, 2024, 03:28 PM

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు దీపికా పదుకునే.. ఇక ఆమె తన గురించి కొన్ని విషయాలు ఓ మీడియా సంస్థతో పంచుకుంది. తన ఫస్ట్ క్రష్ ఎవరో వెల్లడించింది బ్యూటీ. దీపికా పదుకునే బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని అందం, ఇమేజ్, స్టార్ డమ్ తో బాలీవుడ్ లో దూసుకుపోతోంది దీపిక. రణ్ వీర్ సింగ్ తో పెళ్ళి తరువాత కూడా ఏమాత్రంతగ్గేది లేదు అంటోంది దీపిక. పెళ్ళి తరువాత కూడా బోల్డ్ సీన్స్  విషయంలో వెనకడుగు వేయడం లేదు దీపిక. ఇక తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. ఉదయం తన దినచర్య వేడి నీటితో స్టార్ట్ అవుతుంది అన్నారు. కెరీర్ బిగినింగ్ లో చాలా కష్టాలు పడ్డాను. షూటింగ్ లో అలిసిపోయి..క్యాబ్ లోనే నిద్రపోయేదాన్ని.. నేను వచ్చేవరకూ అమ్మకు టెన్షన్ తప్పేది కాదు అన్నారు.అంతే కాదు నేను..చెల్లి నిరాడంబరంగానే పెరిగాము.. చాలా సింపుల్ గా పెంచారు మాతల్లీ తండ్రులు..మేము కూడా మా పిల్లల్ని అలానే పెంచాలి అనుకుంటున్నాము. నాతో పాటు నా భర్త రణ్ వీర్ కూడా చాలా సింపుల్ గా ఉంటారు. పెద్దగా ఆర్భాటాలకు వెళ్ళరు. సాధారణ దీపికాలాగే ఉండాలని అనుకుంటాను, మా బంధువులు కూడా నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నావు అంటుంటారు అని అన్నారు దీపిక. దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా.. లియోనార్డో డికాఫ్రియో.. అవును ఆ హాలీవుడ్ హీరో అంటే ఆమెకు పిచ్చంట. తనతో పాటు తన చెల్లికి కూడా ఆహీరో అంటే క్రష్ అంటోంది దీపికా.  ఆ హీరో పెద్ద పెద్ద పోస్టర్లు తమ రూమ్ నిండా అంటించేవారట. ఇక టాలీవుడ్ లో ఆమెకు నచ్చిన హీరో అంటే మహేష్ బాబు అని చెప్పేసింది దీపిక.    ఇక నేను.. రణ్ వీర్ చాలా బిజీగా ఉంటామ్. ఎవరి షూటింగ్స్ వారివి.. ఇక మాకు టైమ్ దొరికితే.. ఇంట్లో కబుర్లు చెప్పుకూంటూ గడిపేస్తాం.. రోజంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం. ఇక ఇద్దరికి డాన్స్ అంటే ఇష్టం. మంచి పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూనే ఉంటాం. అలా అర్ధరాత్రి  వరకూ డాన్స్ చేసిన సంరద్భాలు ఉన్నాయి. ఒక్కోసారి తెల్లవారుజామున 4గంటల వరకూ కూడా డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి అన్నారు దీపిక. తీరిక దొరికితే ఇంటిపనులు చేసుకోవడనాకి ఇష్టపడుతుందట దీపిక. ఇక తనకు చాలా ఇష్టమైన పండగ హోలీ అని అంటోంది దీపిక. ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది బ్యూటీ. ప్రభాస్ సరసన కల్కీ సినిమాలో నటిస్తోంది. ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. 


 


 

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM