ఓటీటీలోకి వచ్చిన రాధిక ఆప్టే బోల్డ్ మూవీ

by సూర్య | Wed, Apr 17, 2024, 03:35 PM

రాధిక ఆప్టే.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ తన ఉనికిని చాటుకుంటుంది. నందమూరి బాలకృష్ణతో లెజెండ్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అందాల ఆరబోత చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ భామ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ' రక్త చరిత్ర' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన రాధిక.. ధోని, లెజెండ్, లయన్ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈమె తెలుగులో కంటే హిందీలో‌నే ఎక్కువగా సినిమాలు చేస్తుండటం.. అందులోను బోల్డ్ సీన్సే ఎక్కువగా ఉండటంతో కుర్రకారుకి ఈ భామ దగ్గరైంది. 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 'స్లమ్ డాగ్ మిలియనీర్ ' సినిమాతో పాపులర్ అయిన దేవ్  పటేల్ తో ఈ మూవీలో మెప్పించింది. 2019 లో విడుదలైన ' ది వెడ్డింగ్ గెస్ట్'  బ్రిటీష్ అమెరికన్ చిత్రంగా విడుదలైంది. కానీ ఇండియాలో విడుదల కాలేదు. మైఖెల్ వింటర్ బాటమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో విడుదలైన ఈ సినిమా దాదాపు అయిదేళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.రాధిక ఆప్టే  ఈ సినిమాలో మితిమీరిన బీల్డ్ సీన్స్ చేయడంతో వైరల్ గా మారింది. ఇందులో హీరో, హీరోయిన్ ల మధ్య సాగే శృంగార సన్నివేశం ఒకటి ముందే లీక్ అవ్వడంతో అప్పట్లో ఫుల్ వైరల్ అయింది. దానిపై రాధిక అగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో రాధిక ఆప్టే వొంటి మీద పూర్తిగా దుస్తులు తొలగించిన సీన్స్ ఉండటంతో ' ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మరి నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమాని మీరు చూశారా? లేదా కామెంట్ చేయండి.


 


 

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM