50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి'

by సూర్య | Tue, Apr 16, 2024, 08:22 PM

విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ నటించిన 'గామి' సినిమా మహా శివరాత్రి శుభ సందర్భంగా మార్చి 8, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క OTT హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 72 గంటలలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM