'ది రాజా సాబ్' షూటింగ్ లో జాయిన్ అయ్యిన నిధి అగర్వాల్

by సూర్య | Tue, Apr 16, 2024, 03:10 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. కొద్దిరోజుల క్రితమే ఈ పాన్-ఇండియన్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ది రాజా సాబ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


తాజాగా ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ హైదరాబాద్‌లోని రాజా సాబ్ సెట్స్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. కొద్దిరోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో ఆమె పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా  2025 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM