'గీతాంజలి మళ్ళీవచ్చింది' నార్త్ అమెరికా గ్రాస్ ఎంతంటే ...!

by సూర్య | Mon, Apr 15, 2024, 07:08 PM

నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి నటించిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' సినిమా ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. హారర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $50,415 వసూళ్లు చేసినట్లు సమాచారం.

శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ మరియు ఇతర నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అంజలి 50వ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడు. కోన ఫిలింస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోన వెంకట్, ఎంవివి సినిమాస్ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM