శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వంభర'

by సూర్య | Mon, Apr 15, 2024, 07:06 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ దర్శకుడు వస్సిష్ట మల్లిడితో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ భారీ బడ్జెట్ సినిమా చిరంజీవి కెరీర్‌లో 156వ ప్రాజెక్ట్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో సురభి, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రలలో కనిపించనున్నారు. రచయిత-నటుడు నుండి దర్శకుడిగా మారిన హర్ష వర్ధన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.


ఈ ఫాంటసీ డ్రామా జనవరి 10, 2025న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు.

Latest News
 
ఆరు రోజులలో బ్రేక్ ఈవెన్ ని చేరుకున్న 'కృష్ణమ్మ' Thu, May 16, 2024, 04:23 PM
జీ టీవీ తెలుగులో సాలిడ్ టివిఆర్ ని నమోదు చేసిన 'హనుమాన్' Thu, May 16, 2024, 04:21 PM
పోటెల్ : బుజ్జిమేక పాటకి తన గాత్రాన్ని అందించిన నేషనల్ అవార్డు విన్నర్ Thu, May 16, 2024, 04:19 PM
వాయిదా పడిన 'రాజు యాదవ్' Thu, May 16, 2024, 04:17 PM
'నింద' టీజర్ అవుట్ Thu, May 16, 2024, 04:16 PM