'థగ్ లైఫ్‌' లో దుల్కర్ సల్మాన్ స్థానంలో శింబు

by సూర్య | Sat, Apr 13, 2024, 12:55 PM

ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు స్టార్ దర్శకుడు మణిరత్నం దాదాపు 17 సంవత్సరాల తర్వాత కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'థగ్ లైఫ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశల్లో ఉంది.


షెడ్యూల్ సమస్య కారణంగా దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు మరియు జయం రవి విషయంలో కూడా అదే జరిగింది. ఇటీవలి రిపోర్ట్స్ ప్రకారం, శింబు ఈ బిగ్గీకి సంబంధించిన లుక్ పరీక్షను పూర్తి చేసాడు మరియు అతి త్వరలో సెట్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. దుల్కర్ రీప్లేస్‌మెంట్ గురించి త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఈ సినిమాలో త్రిష కృష్ణన్, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ మరియు జయం రవి కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, మరియు శివ అనంతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
లిఫ్ట్‌లో కాబోయే భార్యతో నాగచైతన్య Sun, Oct 20, 2024, 11:16 AM
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM