'ది ఫ్యామిలీ స్టార్' హిందీ మరియు మలయాళ వెర్షన్‌లపై నో అప్‌డేట్

by సూర్య | Sat, Apr 13, 2024, 12:14 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రం ప్రొమోషన్స్ లో నిర్మాత దిల్ రాజు హిందీ మరియు మలయాళం వెర్షన్‌లను తెలుగు విడుదలైన రెండు వారాల తర్వాత విడుదల చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే ఒక వారం గడిచినందున, దీనిపై ఎటువంటి అప్‌డేట్ లేదు. వారు నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయవచ్చని ఊహాగానాలు సూచిస్తున్నాయి. అయితే ఇంకా ఏదీ ధృవీకరించబడలేదు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. వాసుకి, అభినయ, రవిబాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క రియేషన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM