$850K మార్క్ ని చేరుకున్న 'ఫ్యామిలీ స్టార్' USA ప్రీమియర్స్

by సూర్య | Sat, Apr 13, 2024, 09:13 AM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని సరిగమ సినిమాస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్స్ గ్రాస్ $850K మార్క్ కి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. వాసుకి, అభినయ, రవిబాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM