'ది గోట్' మొదటి సింగిల్ విడుదల అప్పుడేనా?

by సూర్య | Sat, Apr 13, 2024, 09:02 AM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానుంది.


తాజాగా ఇప్పుడు, ఈ మెగా-బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌ యొక్క ఫస్ట్ సింగల్ ని రేపు తమిళ న్యూ ఇయర్ స్పెషల్ గా లాంచ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
కన్నడ స్టార్ హీరో యశ్‌ కీలక వ్యాఖ్యలు Wed, Oct 23, 2024, 12:42 PM
ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే? Wed, Oct 23, 2024, 12:30 PM
ఆడపిల్లలను ఎలా గౌరవించాలో కొడుకులకు తల్లులే చెప్పాలి: కరీనా Wed, Oct 23, 2024, 10:27 AM
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM