by సూర్య | Thu, Apr 11, 2024, 05:10 PM
టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ కామెడీ సినిమాని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ స్ట్రైక్ ని విడుదల చేసారు. అంతేకాకుండా ఈ సినిమాకి విశ్వం అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.
కావ్య థాపర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి చిత్రాలయం స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.