విడుదల తేదీని లాక్ చేసిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'

by సూర్య | Thu, Apr 11, 2024, 04:46 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో నటుడి పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
బ్లాక్ చీరలో గ్లామరస్‌గా సాక్షి మాలిక్ Tue, Oct 29, 2024, 08:54 PM
కేజీఎఫ్ హీరో య‌శ్‌కు బిగ్ షాక్ Tue, Oct 29, 2024, 08:42 PM
సిటాడెల్ : హనీ బన్నీ కొత్త ట్రైలర్ అవుట్ Tue, Oct 29, 2024, 07:51 PM
'కంగువ' నుండి కింగ్స్ ఎంతమ్ సాంగ్ రిలీజ్ Tue, Oct 29, 2024, 07:27 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రాబిన్‌హుడ్' Tue, Oct 29, 2024, 07:22 PM