విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ విడుదల

by సూర్య | Thu, Mar 28, 2024, 02:13 PM

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ఫ్యామిలీ స్టార్”. మరి టైటిల్ అనౌన్స్మెంట్ నాటి నుంచే మంచి బజ్ ని రేపిన ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు రిలీజ్ దగ్గరకి వస్తున్న సమయంలో మేకర్స్ ఫైనల్ గా అవైటెడ్ ట్రైలర్ ని అయితే రిలీజ్ చేశారు.మరి ఈ ట్రైలర్ మాత్రం ఒకింత డిఫరెంట్ గా ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పాలి. విజయ్ పై కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఒక పక్క ఫ్యామిలీ మ్యాన్ గా మరో పక్క యూఎస్ లో లుంగిలో కనిపిస్తూ తన మార్క్ డిఫరెంట్ ట్రీట్ ఇచ్చాడు. అలాగే మృణాల్ తో సీన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ బాగున్నాయి. అలాగే పలు ఫ్యామిలీ సీన్స్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తున్నాయి.ఇక వీటితో పాటుగా ట్రైలర్ లో మంచి మాస్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక మ్యూజిక్ గాని విజువల్స్ గాని రిచ్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఈ ఫ్యామిలీ స్టార్ కాస్త డిఫరెంట్ గానే ఉన్నాడని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ ఏప్రిల్ 5న తెలుగు సహా హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతోంది.


 


 

Latest News
 
'భజే వాయు వేగం' నుండి సెట్ అయ్యిందే లిరికల్ సాంగ్ అవుట్ Thu, May 09, 2024, 03:18 PM
రేపు విడుదలకి సిద్ధంగా ఉన్న 'ప్రతినిధి 2' Thu, May 09, 2024, 03:12 PM
సందీప్ కిషన్ 'మాయావన్' టీజర్ రిలీజ్... Thu, May 09, 2024, 03:12 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' Thu, May 09, 2024, 03:10 PM
నేడు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'లవ్ గురు' Thu, May 09, 2024, 03:08 PM