సందీప్ కిషన్ 'మాయావన్' టీజర్ రిలీజ్...

by సూర్య | Thu, May 09, 2024, 03:12 PM

సందీప్ కిషన్  వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఊరుపేరు భైరవకోన సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు సందీప్. ప్రస్తుతం సందీప్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. గతంలో సందీప్ కిషన్ హీరోగా తమిళ్ దర్శకుడు CV కుమార్ దర్శకత్వంలో మాయావన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ Z గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి  మాయావన్ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. CV కుమార్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మాయావన్ సీక్వెల్ ప్రకటించి పూజా కార్యక్రమాలు చేసి షూటింగ్ కూడా జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్ మొత్తం సైన్స్ ఫిక్షన్ గానే సాగింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగిన ఈ టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది. టీజర్ లో విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ మాయావన్ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM