చిరు 'విశ్వంభర' పై లేటెస్ట్ బజ్

by సూర్య | Mon, Mar 04, 2024, 02:45 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ దర్శకుడు వస్సిష్ట మల్లిడితో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రకటన మొదటి రోజు నుండి అభిమానులలో విపరీతమైన అంచనాలను సృష్టించింది.


ఈ భారీ బడ్జెట్ సినిమా చిరంజీవి కెరీర్‌లో 156వ ప్రాజెక్ట్. ఈ సినిమాలో చిరంజీవి దొరబాబు పాత్రలో రాయల్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ చిత్రంలో చిరంజీవికి అయిదుగురు సిస్టర్స్ ఉన్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.

ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. రచయిత-నటుడు నుండి దర్శకుడిగా మారిన హర్ష వర్ధన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఫాంటసీ డ్రామా జనవరి 10, 2025న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి MM కీరవాణి సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM