కళ్ళ ముందు కొత్త ఎక్స్పీరియన్స్ ను చూపిస్తుంది

by సూర్య | Mon, Mar 04, 2024, 02:43 PM

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్  బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు.సాయి రోనాక్ , ప్రగ్యా నగ్రా జంట‌గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. మన తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లినీ కన్నుల విందుగా చూపించ బోతున్నామ‌ని, ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటారని, కళ్ళ ముందు కొత్త ఎక్స్పీరియన్స్ ను ఉంచే ఈ సినిమా.. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రం అవుతుందని..." అని దర్శకుడు రమేష్ చెప్పాల , నిర్మాత వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా.న‌టుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయని, అందుకు భిన్నంగా ఈ లగ్గం సినిమా ఉండ బోతోందని తెలంగాణదనం ఉట్టిపడే విధంగా దర్శకుడు రమేష్ ఈ సినిమాను తేరకెక్కిస్తున్నాడ‌ని" అన్నారు. అన్ని ర‌కాల‌ హంగులతో దర్శకుడు లగ్గం యూనివర్స్ ను క్రియేట్ చేయబోతున్నాడ‌ని న‌టి రోహిణి తెలిపింది.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM