లెహంగా, వోణీలో మెరిసిన శ్రద్ధా దాస్

by సూర్య | Sat, Mar 02, 2024, 11:21 AM

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఫిట్ నెస్ విషయంలో,  అందం విషయంలో రోజురోజుకు మరింతగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. నయా లుక్స్ తో అలరిస్తోంది. ఇక శ్రద్ధా దాస్ నెట్టింట అడుగుపెడితే మాత్రం తన గ్లామర్ మెరుపులతో ఫ్యాన్ కు ఆరోజంతా పండగనే చెప్పాలి. ఓవైపు లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే.. మరోవైపు అందాల విందు చేస్తోంది.ఇప్పటికే శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తోందో తెలిసిందే. ఈక్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.ఈసారి శ్రద్ధా బ్యూటీఫుల్ కలర్ ఆరెంజ్ డ్రెస్ లో మెరిసింది. లెహంగా, వోణీలో పదహారేళ్ల అమ్మాయిలా దర్శనమిచ్చి మెస్మరైజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆమెను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. శ్రద్దా దాస్ ఇచ్చిన ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు  ఫిదా అవుతున్నారు. ‘దేవుడు పంపిన అరుదైన అందం’ అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శ్రద్ధా దాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పారిజాత పర్వం అనే సినిమాతో అలరించబోతోంది. అలాగే తను లీడ్ రోల్ లో నటించిన ‘అర్థం’ అనే సినిమా విడుదల కావాల్సి ఉంది.


 


 


 





Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM