by సూర్య | Fri, Mar 01, 2024, 09:15 PM
రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'బ్రహ్మయుగం' చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, హారర్-థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రం UK మరియు ఐర్లాండ్ లో విడుదలైన 14 రోజులలో £200,270 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.
ఈ సినిమాలో అర్జున్ అశోక్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.
Latest News