UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 14 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...!

by సూర్య | Fri, Mar 01, 2024, 09:15 PM

రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'బ్రహ్మయుగం' చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, హారర్-థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రం UK మరియు ఐర్లాండ్ లో విడుదలైన 14 రోజులలో £200,270 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.


ఈ సినిమాలో అర్జున్ అశోక్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898AD' UK థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 29, 2024, 07:19 PM
'సూర్య 44' లో ఎడిటర్ గా షఫీక్ మొహమ్మద్ అలీ Wed, May 29, 2024, 07:16 PM
ఓపెన్ అయ్యిన 'గం గం గణేశ' బుకింగ్స్ Wed, May 29, 2024, 07:14 PM
వరుణ్ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మించనున్న స్టార్ డైరెక్టర్ Wed, May 29, 2024, 07:13 PM
'యేవమ్' ర్యాప్ సాంగ్ అవుట్ Wed, May 29, 2024, 07:08 PM