మార్చి 8 నుంచి ఓటీటీలో ‘హనుమాన్‌’

by సూర్య | Fri, Mar 01, 2024, 07:50 PM

సంక్రాంతి బరితో విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకొంది ‘హనుమాన్‌’  చిత్రం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది. 300 థియేటర్స్‌లో 30 రోజులు పూర్తి చేసుకుంది. నేటికి ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. ‘హనుమాన్‌’ డిజిటల్‌ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. తొలుత విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్‌ చూసి వాయిదా వేసుకున్నారు. మార్చి 2న ఓటీటీ స్ట్రీమింగ్ అనుకున్నారు. ఇప్పుడు అది కూడా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి    స్ట్రీమింగ్  చేయాలని ఫిక్సయ్యారు. రానున్న రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరి భారీ చిత్రాలతో సమానంగా విడుదలైన ఈ చిత్రం ఆ సినిమాల్ని మించి సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM