త్వరలో విడుదల కానున్న 'ఫ్యామిలీ స్టార్' టీజర్

by సూర్య | Fri, Mar 01, 2024, 03:44 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం అధికారక విడుదల తేదీని ప్రకటించనుంది. ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.


ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా అని లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM