'గుంటూరు కారం' OST విడుదలకి తేదీ లాక్

by సూర్య | Thu, Feb 29, 2024, 08:32 PM

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రం భారీ బజ్ మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఇటీవలే ఈ చిత్రం డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా OTTలో సెన్సషనల్ రికార్డుని క్రియేట్ చేసింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గుంటూరు కారం యొక్క OST (ఒరిజినల్ సౌండ్‌ట్రాక్)ని మార్చి 9, 2024న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త వీడియో ని పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మీనాక్షి చౌదరి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు, మరియు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM