OTT పార్టనర్ ని లాక్ చేసిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'

by సూర్య | Thu, Feb 29, 2024, 07:07 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం యొక్క OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
'దేవర' టీమ్ తో టాలీవుడ్ యువ నటులు Fri, Sep 20, 2024, 03:08 PM
నేడే 'వెట్టయన్' ఆడియో లాంచ్ Fri, Sep 20, 2024, 02:52 PM
ముంబై విమానాశ్రయంలో కొత్త జంట Fri, Sep 20, 2024, 02:51 PM
ఆహాలో ప్రసారం అవుతున్న 'తిరగబడరా సామీ' Fri, Sep 20, 2024, 02:48 PM
ప్రముఖ OTT ప్లాట్ఫారంలో ప్రసారం అవుతున్న 'సత్యభామ' Fri, Sep 20, 2024, 02:40 PM