భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించిన 'గేమ్ ఛేంజర్'

by సూర్య | Thu, Feb 29, 2024, 05:13 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేటితో ముగిసింది. RFCలో జరిగిన ఈ షెడ్యూల్ లో రామ్‌చరణ్ మరియు నవీన్‌చంద్రపై అన్‌బరీవ్ మాస్టర్స్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబడింది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM