'ట్రూ లవర్' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...!

by సూర్య | Thu, Feb 29, 2024, 04:12 PM

ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో గుడ్ నైట్ ఫేమ్ మణికందన్ నటించిన 'ట్రూ లవర్' సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా OTT హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజగా ఇప్పుడు ఈ సినిమా మార్చి 8, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్, నిఖిలా శంకర్, రిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని తెలుగురాష్ట్రాల్లో SKN విడుదల చేస్తుండగా, మారుతి టీమ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పసిలియన్, యువరాజ్ గణేశన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
నేడు విడుదల కానున్న 'స్వాగ్' మూడవ సింగల్ Sat, Sep 21, 2024, 03:02 PM
'వెట్టయన్' ప్రివ్యూ అవుట్ Sat, Sep 21, 2024, 02:57 PM
దీపావళి రేస్ లో 'షణ్ముఖ' Sat, Sep 21, 2024, 02:51 PM
'బాలు గాని టాకీస్' డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే...! Sat, Sep 21, 2024, 02:46 PM
ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రణీత Sat, Sep 21, 2024, 02:43 PM