'బాలు గాని టాకీస్' డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే...!

by సూర్య | Sat, Sep 21, 2024, 02:46 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఆహా ఇటీవలే తాజా ఒరిజినల్ డ్రామా బాలు గాని టాకీస్‌ అనే సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్ కి శ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి సాగర్ నిర్మించగా, పి. రూపక్ ప్రణవ్ తేజ్ సహ నిర్మాతగా ఉన్నారు. తాజాగా డిజిటల్ ప్లాట్ఫారం ఈ సినిమా యొక్క విడుదలా తేదీని లాక్ చేసింది. బాలు గాని టాకీస్ అక్టోబర్ 4, 2024న ఆహాలో ప్రదర్శించబడుతుంది అని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం వెల్లడించింది. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. శివ రామ చంద్రవరపు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి మరియు శేఖర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం కామెడీ మరియు డ్రామా యొక్క గొప్ప సమ్మేళనానికి హామీ ఇస్తుంది. స్మరన్ ఆకర్షణీయమైన స్కోర్, బాలు శాండిల్యస సినిమాటోగ్రఫీ, ఆదిత్య బిఎన్ డైనమిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఈ చిత్రం విజువల్ మరియు ఆడిటరీ ట్రీట్. అశ్వంత్ బైరీ కాస్ట్యూమ్ డిజైన్ మరియు అశ్విత్ గౌతమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని డిజిటల్ ప్లాట్ఫారం త్వరలో వెల్లడి చేయనున్నది.

Latest News
 
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు 31 నగరాల్లో జరగనున్నాయి - నాగార్జున Sat, Sep 21, 2024, 04:08 PM
'సరిపోదా శనివారం' నుండి ఉల్లాసం వీడియో సాంగ్ రిలీజ్ Sat, Sep 21, 2024, 04:04 PM
సుధీర్ బాబు 'జటాధార'లో ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Sep 21, 2024, 03:58 PM
'దేవర' నుండి రెండవ ట్రైలర్ విడుదల కానుందా? Sat, Sep 21, 2024, 03:52 PM
యూట్యూబ్ మ్యూజిక్ ట్రేండింగ్ లో 'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ సింగల్ Sat, Sep 21, 2024, 03:47 PM