'గామి' నుండి గమ్యాన్నే - ది క్వెస్ట్ సాంగ్ రిలీజ్

by సూర్య | Mon, Feb 26, 2024, 02:43 PM

విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గామి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో నుండి ది క్వెస్ట్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం మహా శివరాత్రి శుభ సందర్భం సందర్భంగా మార్చి 8, 2024న విడుదల కానుంది. విశ్వక్సేన్ ఈ సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'కంగువ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 03:46 PM
తెలుగు సినిమాలపై ఆసక్తిని చూపుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Oct 19, 2024, 03:41 PM
'ఓదెలా 2' లో తమన్నా సంచలనం Sat, Oct 19, 2024, 03:36 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ఎవిక్షన్ ప్రమాదంలో ఇద్దరు స్టార్ కంటెస్టెంట్స్ Sat, Oct 19, 2024, 03:29 PM
'వేట్టయాన్' కోసం ప్రీక్వెల్ ప్లాన్స్ Sat, Oct 19, 2024, 03:26 PM