దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇంట సంబరాలు

by సూర్య | Fri, Feb 23, 2024, 06:34 PM

టాలీవుడ్ అగ్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు.. ప్రముఖ నేప‌థ్య గాయ‌కుడు సాగ‌ర్  మ‌రోసారి తండ్రి అయ్యాడు. ఆయ‌న భార్య డా.ప్రియ పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆ జంటకు టాలీవుడ్ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. వీరికి మొద‌ట సంతానం అబ్బాయి కాగా రెండో సారి కూడా అబ్బాయి జ‌న్మించ‌డం విశేషం.ఇదిలాఉండ‌గా సాగ‌ర్ నేప‌థ్య గాయ‌కుడిగా అన్న దేవీ ప్ర‌సాద్ సంగీతంలో చాలా పాట‌లు పాడారు. ఇంకా చెప్పాలంటే డీఎస్పీ సంగీతం అందించే ప్ర‌తి సినిమాలో సాగ‌ర్‌తో ఓ పాట పాడించ‌డం ఆన‌వాయితీగా ఉంటుంది. 2023 సెప్టెంబ‌ర్ 18న జ‌రిగిన‌ సాగ‌ర్ కుమారుడి ప్ర‌థ‌మ పుట్టిన‌రోజు వేడుక‌లు దేవీశ్రీ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో గ్రాండ్‌గా నిర్వ‌హించ‌గా అప్పుడు ఆ ఫొటోలు నెట్టింట బాగా వైర‌ల్ అయ్యాయి.

Latest News
 
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM
డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'క' Fri, Oct 18, 2024, 07:25 PM
రొమాంటిక్ డ్రామాలో సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ Fri, Oct 18, 2024, 07:21 PM