'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు

by సూర్య | Fri, Oct 18, 2024, 08:28 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని అక్టోబర్ 21న మధ్యాహ్నం 3:30 గంటలకి హైదరాబాద్ లోని AMB స్క్రీన్ 1లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాని అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల కానుంది.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM