'ఇండియన్ 2' నైజాం హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు

by సూర్య | Wed, Feb 21, 2024, 07:10 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కెప్టెన్ మిల్లర్, జిగర్ తండా మరియు మామన్నన్ వంటి తమిళ చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్‌సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్) ఈ సినిమా నైజాం హక్కులను గణనీయమైన మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది అని సమాచారం. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
'కుబెరా' చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది - శేఖర్ కమ్ముల Mon, Mar 24, 2025, 09:28 PM
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు Mon, Mar 24, 2025, 08:22 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు Mon, Mar 24, 2025, 08:13 PM
ఈ కార‌ణంతో నేను ఎన్నో అవ‌కాశాలు కోల్పోయా Mon, Mar 24, 2025, 07:26 PM
'OG' నుండి ఇమ్రాన్ హష్మీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Mon, Mar 24, 2025, 07:12 PM