భీమా : గల్లీసౌందుల్లో ఫుల్ లిరికల్ సాంగ్ అవుట్

by సూర్య | Wed, Feb 21, 2024, 07:11 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది. మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి గల్లీసౌందుల్లో ఫుల్ లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ఈ విషయాన్ని మూవీ మేకర్స్  ప్రకటించారు.

ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM