by సూర్య | Wed, Feb 21, 2024, 06:41 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క యాక్షన్ ప్యాక్డ్ టీజర్ అభిమానులలో మరియు ట్రేడ్ వర్గాల్లో అంచనాలను పెంచింది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాని ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడుదల తేదీని మూవీ మేకర్స్ త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.