రికార్డు ధరకు అమ్ముడయిన 'టిల్లు స్క్వేర్' డిజిటల్ రైట్స్

by సూర్య | Wed, Feb 21, 2024, 06:37 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ డిజె టిల్లుకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ చిత్రం మార్చి 29, 2024న విడుదల కానుంది.


తాజాగా ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ 35 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ లేదా డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించనప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM