'హరి హర వీర మల్లు' స్పెషల్ ప్రోమో విడుదల ఎప్పుడంటే....!

by సూర్య | Wed, Feb 21, 2024, 04:55 PM

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. గత కొంత కాలంగా తన రాజకీయ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నందున ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క హై-ఎండ్ VFX పనులు శరవేగంగా జర్గుతున్నట్లు సమాచారం.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మార్చి 8, 2024న ఈ సినిమా నుండి స్పెషల్ ప్రోమోని మూవీ మేకర్స్ విడుదల చేయనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో  బాబీ డియోల్ ,అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM