ఫిలిం ఆఫ్ ది ఇయర్ 2024 గా 'సాలార్'

by సూర్య | Wed, Feb 21, 2024, 03:10 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్: పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ సాలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


ఈ చిత్రం థియేటర్స్ లోనే కాకుండా OTTలో కూడా సెన్సషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024 అవార్డును సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్ర పోషించాడు.


యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM