'కంగువ' కి డబ్బింగ్ చెప్పడం స్టార్ చేసిన సూర్య

by సూర్య | Wed, Feb 21, 2024, 03:08 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క యాక్షన్ ప్యాక్డ్ టీజర్ అభిమానులలో మరియు ట్రేడ్ వర్గాల్లో అంచనాలను పెంచింది.


తాజాగా ఇప్పుడు నటుడు సూర్య ఈ సినిమా డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ తెలియజేసేందుకు స్టూడియోలో సూర్య డబ్బింగ్ చెప్తున్న స్టిల్స్ ని సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది.


ఈ సినిమా ఏప్రిల్ 11,2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
బాలీవుడ్ లో ఉత్సహం నింపిన 'ఛావా' Tue, Feb 18, 2025, 11:42 AM
ఆ సినిమా నా ఆత్మకథ Tue, Feb 18, 2025, 11:40 AM
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కన్నడ భామలు Tue, Feb 18, 2025, 11:38 AM
రాంప్రసాద్ ప్రధాన పాత్రలో 'W/O అనిర్వేష్' Tue, Feb 18, 2025, 11:31 AM
ఈ నెల 26న విడుదల కానున్న 'మజాకా' Tue, Feb 18, 2025, 11:28 AM