ఆంధ్రప్రదేశ్ లో 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రమోషనల్ టూర్‌

by సూర్య | Wed, Feb 21, 2024, 03:05 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఆపరేషన్ వాలెంటైన్‌లో కనిపించనున్నాడు. ఈ ఏరియల్ థ్రిల్లర్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రొమోషన్స్ ని మూవీ మేకర్స్ ప్రారంభించారు. తాజాగా మూవీ టీమ్ ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషనల్ టూర్‌ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం ఈ సినిమా మార్చి 1, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో పరేష్‌ప్అహుజా, రుహాని శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.

Latest News
 
బాలీవుడ్ లో ఉత్సహం నింపిన 'ఛావా' Tue, Feb 18, 2025, 11:42 AM
ఆ సినిమా నా ఆత్మకథ Tue, Feb 18, 2025, 11:40 AM
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కన్నడ భామలు Tue, Feb 18, 2025, 11:38 AM
రాంప్రసాద్ ప్రధాన పాత్రలో 'W/O అనిర్వేష్' Tue, Feb 18, 2025, 11:31 AM
ఈ నెల 26న విడుదల కానున్న 'మజాకా' Tue, Feb 18, 2025, 11:28 AM