రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....!

by సూర్య | Tue, Feb 20, 2024, 09:17 PM

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికి తెలిసందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని మార్చి మొదటి వారంలో ప్రారంభించి, అదే నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Latest News
 
'కుబెరా' చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది - శేఖర్ కమ్ముల Mon, Mar 24, 2025, 09:28 PM
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు Mon, Mar 24, 2025, 08:22 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు Mon, Mar 24, 2025, 08:13 PM
ఈ కార‌ణంతో నేను ఎన్నో అవ‌కాశాలు కోల్పోయా Mon, Mar 24, 2025, 07:26 PM
'OG' నుండి ఇమ్రాన్ హష్మీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Mon, Mar 24, 2025, 07:12 PM