'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా?

by సూర్య | Tue, Feb 20, 2024, 09:08 PM

ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో గుడ్ నైట్ ఫేమ్ మణికందన్ నటించిన 'ట్రూ లవర్' సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా OTT హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజగా ఇప్పుడు ఈ సినిమా మార్చి 8, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. త్వరలో డిజిటల్ ప్లాట్ఫారం అధికారిక స్ట్రీమింగ్ తేదీని వెల్లడించనుంది.


మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్, నిఖిలా శంకర్, రిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో SKN విడుదల చేస్తుండగా, మారుతి టీమ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పసిలియన్, యువరాజ్ గణేశన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
రన్ టైమ్ ని లాక్ చేసిన 'హిట్ 3' Thu, Apr 24, 2025, 06:59 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'షష్ఠి పూర్తి' సెకండ్ సింగల్ Thu, Apr 24, 2025, 06:55 PM
అధికారికంగా ప్రారంభించబడిన గోపీచంద్ కొత్త చిత్రం Thu, Apr 24, 2025, 06:46 PM
'హిట్ 3' ప్రమోషనల్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 24, 2025, 04:29 PM
కార్తీక్ సుబ్బరాజ్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించిన నాని Thu, Apr 24, 2025, 04:26 PM