by సూర్య | Tue, Feb 20, 2024, 09:03 PM
వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'ఊరి పేరు భైరవకోన' సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ ఫాంటసీ డ్రామా యొక్క మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.
ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.