'లాల్ సలామ్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా?

by సూర్య | Tue, Feb 20, 2024, 06:39 PM

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' చిత్రం ఫిబ్రవరి 9, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మార్చి 1, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో రజనీ ముంబైకి చెందిన మొయిదీన్ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. లాల్ సలామ్ సినిమా క్రికెట్ మరియు హిందూ-ముస్లిం మత ఘర్షణల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంలో భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌, విష్ణు విశాల్ మరియు విక్రాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.


లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ రజనీకాంత్ సోదరిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM