ఓవర్సీస్ లో $500K క్లబ్ లో జాయిన్ అయ్యిన 'ఊరి పేరు భైరవకోన'

by సూర్య | Tue, Feb 20, 2024, 05:33 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'ఊరి పేరు భైరవకోన' సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమాని ఓవర్సీస్ లో సరిగమ సినిమాస్ విడుదల చేస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USAలో $500K క్లబ్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM